జాతీయ వార్తలు

ఇంకా జాప్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: తెలంగాణ రాష్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పురపాలక, ఐటి మంత్రి కెటిఆర్ గురువారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్‌ను మంజూరు చేసి నిధులు కేటాయించాలని, ఈ విషయంలో ఇంకా జాప్యమెందుకుని స్పష్టం చేశారు. విద్యాపరంగా రాష్ట్రం మరింత పురోగతి సాధించేందుకు వీలుగా ట్రిపుల్ ఐటి, ఐఐఎమ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రుల్ని ఆయన కోరారు. అలాగే ఎఫ్‌ఆర్‌బిఎమ్ పరిమితిని 3.5శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర రోడ్ల విస్తరణలో భాగంగా బేగంపేటలోని రసూల్ పురా చౌరస్తా వద్దనున్న రెండు ఎకరాల కేంద్ర ప్రభుత్వ భూమిని రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యాటనలో భాగంగా రాజ్‌నాథ్‌తోపాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ,ప్రకాశ్ జవడేకర్,లండన్ డిప్యూటి మేయ ర్ రాజేష్ అగర్వాల్‌లతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో విజ్ఞప్తి చేశామని,మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి
దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ని కలిసి కరీంనగర్ కేంద్రంగా ఐఐఐటిని ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. దీనితో పాటుగా దేశంలో మరో రెండు ఐఐఐటిలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నయాని,కరీంనగర్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామి ఇచ్చినట్టు చెప్పారు.అదే విధంగా తెలంగాణకు ఐఐఎంను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అయితే ప్రకాష్ జవడేకర్ ఐఐఎం ఏర్పాటు అంశాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లమని సూచించినట్టు చెప్పారు.ఈ నేపధ్యంలోనే కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు అంశంపై ఆయనతో చర్చించినట్టు తెలిపారు.అలాగే తెలంగాణలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3.5 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. దేశ పర్యాటనలో ఉన్న లండన్ డిప్యూటి మేయర్ రాజేష్ అగర్వాల్‌ను కలిసినట్టు తెలిపారు.వచ్చే అక్టోబరులో లండన్ మేయర్ భారత్ పర్యాటనకు రానున్న నేపధ్యంలో హైదరాబాద్‌కు వచ్చేలా సహాకరం అందించాలని కోరినట్టు తెలిపారు.మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ వినోద్,ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ,రామచంద్ర తెజావత్ తదీతరులు ఉన్నారు.
విమోచన దినోత్సవం అవసరం లేదు
తెలంగాణ అవిర్భావ దినోత్సవం జూన్ రెండునాడు ఘనంగా జరుపుతున్నమని,ఇప్పుడు విమోచన దినం జరపాల్సిన అవసరం లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ విమోచన దినం పేరుతో బీజేపీ రాజకీయ లభ్ధిపొందలని చూస్తొందని ఆరోపించారు.బీజేపీ తలపెట్టిన సెప్టెంబరు 17 నాటి కార్యక్రమానికి రాజ్‌నాథ్‌సింగ్ హోంశామంత్రిగా రావడం లేదని,బీజేపీ నేతగానే వస్తున్నారని భావిస్తున్నాట్టు పేర్కొన్నారు.టీఆర్‌ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే అలవాటు బీజేపీకి ఉందని మండ్డిపడ్డారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అస్థిత్వానికి,ప్రభావానికి ఏటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల ఉద్యమ సమయంలో విమోచన దినానకి సమర్ధించిన మాటా వాస్తవమేనాని తెలిపారు.కాని జూన్ రెండు నాడు రాష్ట్ర అభిర్భావ దినోత్సం ఉందని,విమోచన దినం అవసరం లేదని స్పష్టం చేశారు.

చిత్రం..ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన మంత్రి కెటిఆర్