జాతీయ వార్తలు

ఇతర భాషలనూ గౌరవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశవ్యాప్తంగా హిందీ భాషకు మరింత ప్రాచుర్యం కల్పించాలంటే హిందీ మాట్లాడే ప్రజలు ప్రాంతీయ భాషలను, వాటిని మాట్లాడే ప్రజలను మరింత గౌరవించాలని, మరింత స్థానం కల్పించాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్బోధించారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాల క్రితమే హిందీని అధికార భాషగా గుర్తించినప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హిందీ వినియోగం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోందని అన్నారు. ‘హిందీ మాట్లాడే ప్రజలు ఇతర భాషలకు చోటు కల్పించితీరాలి. ప్రాంతీయ భాషలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని రాష్టప్రతి అన్నారు. ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో రష్యన్ పదం ‘స్పాసిబా’ (కృతజ్ఞతలు) అంటూ తన ప్రసంగాన్ని ముగించానని ఆయన గుర్తుచేశారు. దీంతో బెలారస్ అధ్యక్షుడు ఎజి లుకషెంకో ఎంతో సంతోషించి, తన ప్రసంగాన్ని ‘జైహింద్’ అనే పదంతో ముగించారని రాష్టప్రతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ హిందీ మాట్లాడే ప్రజలు ఇతర భాషల పదాలను వినియోగించడం ద్వారా హిందీని మరింత సుసంపన్నం చేయాలని సూచించారు. దేశాన్ని ఐక్యం చేసే భాష హిందీ అని పేర్కొన్నారు.
రాజ్‌భాష అవార్డులు
హిందీ భాషావృద్ధికి చేసిన కృషికిగాను రాష్టప్రతి గురువారం రాజ్‌భాష పురస్కారాలను అందజేశారు. హింది దివస్ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన వి.ఉదయభాస్కర్, హోమ్ నిధి శర్మ, హర్‌దయాళ్ ప్రసాద్, విష్ణు భగవాన్, విశాఖపట్నానికి చెందిన సుగుణ రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

చిత్రం.. ఢిల్లీలో గురువారం ‘హిందీ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు