జాతీయ వార్తలు

బలపరీక్ష ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామిపై బలపరీక్షకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్, ఎమ్మెల్యే వెట్రివెల్, అన్నాడిఎంకె బహిష్కృత నేత దినకరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం దురైస్వామి ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని గురువారం స్పీకర్‌ను ఆదేశించారు. హైకోర్టు స్టే ఒక విధంగా పళనిస్వామికి ఊరట కలిగించేదే. అలాగే దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన నిర్ణయం బలపరీక్ష తరువాతే తీసుకోగలనని స్పీకర్ హైకోర్టుకు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోవడం, అలాగే బలపరీక్షకు సంబంధించి ఏజి గవర్నర్‌కు నివేదించకపోవడంతో వాయిదా వేయవచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరోపక్క అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి పదవినుంచి శశికళను తప్పిస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం చెల్లుబాటుకాదని దినకరన్ వర్గం వాదిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఓ వినతిపత్రం అందించారు. అధికార అన్నాడిఎంకెలో సంక్షోభం ముదిరిపోవడంతో ప్రతిపక్ష డిఎంకె దాన్ని అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పళనిస్వామి ప్రభుత్వంపై బలపరీక్ష పెట్టాలని నిర్ణయించి హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రిపై 19 మంది ఎమ్మెల్యేలకు విశ్వాసం లేనందున పళనికి సభలో తగిన బలం లేదని స్టాలిన్ వాదిస్తున్నారు. గవర్నర్ నాన్పుడు ధోరణి అవలంబిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణ చేసిన డిఎంకె హైకోర్టును ఆశ్రయించింది.
కాగా శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ దినకరన్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల అధికారులతో సమావేశం తరువాత రాజ్యసభ ఎంపీ విజిల సత్యనాథన్ మీడియాతో మాట్లాడుతూ శశికళను తప్పించడం పార్టీ బైలాస్‌కు వ్యతిరేకమని అన్నారు.