జాతీయ వార్తలు

వ్యూహాత్మక భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, సెప్టెంబర్ 14: భారత్, జపాన్ దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేస్తూ గురువారం 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనా తనదిగా వాదిస్తున్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే కీలకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. వాణిజ్యం, భద్రత, పౌర అణు ఇంధనం అంశాలలో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అనుసరించవలసిన మార్గాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
అనంతరం షింజో అబేతో కలిసి సంయుక్త విలేఖరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్-జపాన్ సంబంధాలు కేవలం ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకే పరిమితం కాలేదని అన్నారు. ఇరు దేశాలు కీలకమైన ప్రపంచ అంశాలపై ఎంతో సన్నిహితంగా సహకరించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఇరు దేశాలు పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వంటి కీలకమైన రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి సంబంధించిన 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
‘జపాన్-్భరత్ సంబంధాలలో నూతన శకం ప్రారంభానికి మైలురాయిగా నిలిచే ఒక సంయుక్త ప్రకటనపై మేము ఇప్పుడే సంతకాలు చేశాం.. దాని ఆధారంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు మొత్తం ప్రపంచంలో శాంతి, సౌభాగ్యాలను పెంపొందించడానికి దృఢమైన జపాన్-్భరత్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసికెళ్తాం’ అని అబే అన్నారు. ఇటీవల నిర్వహించిన మలబార్ జపాన్- భారత్- అమెరికా నావికా విన్యాసాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ దిశగా సహకారం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. జపాన్-్భరత్ పెట్టుబడుల మద్దతు రోడ్ మ్యాప్‌ను ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. భారత్-జపాన్ పౌర అణు ఇంధన ఒప్పందం గురించి మోదీ ప్రస్తావిస్తూ, ఇరు దేశాల మధ్య స్వచ్ఛమైన ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి ఇది నూతన శకానికి నాంది పలికిందని అన్నారు.
చిత్రం..భారత్, జపాన్ వార్షిక సదస్సులో ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న షింజో అబే, నరేంద్ర మోదీ