జాతీయ వార్తలు

అక్టోబర్‌లో రాహుల్‌కు పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అక్టోబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించే అంశంపై సీనియర్ నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు అక్టోబర్‌లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొత్త సభ్యులను ఎన్నుకోవటంద్వారా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్‌లో పెనుమార్పులు జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ సీనియర్ నాయకులను పక్కనపెట్టి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే ఆయన సంస్థాగత ఎన్నికల్లో ఎక్కువమంది యువకులకు పార్టీ పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్లు కీలక పదవుల్లో కొనసాగినంత కాలం పార్టీని బాగుచేయటం సాధ్యం కాదని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే పార్టీ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ఆలోచనా విధానం కాంగ్రెస్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నదని, ఆయన మాట, వ్యవహరిస్తున్న తీరు చాలా మారాల్సి ఉన్నదని సీనియర్ నాయకులు ఇటీవలే అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం సీనియర్ నాయకులను పక్కన పెడితే కాంగ్రెస్ నిలదొక్కుకోవటం కష్టమవుతుంది. అదే సమయంలో బిజెపి మరింత పుంజుకుంటుందని సోనియా గాంధీని సీనియర్లు హెచ్చరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ మరికొంతకాలం సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేయటమే మంచిదని వీళ్లంతా అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్యం మూలంగా తాను ఎక్కువ కాలం కాంగ్రెస్ అధ్యక్ష భారాన్ని భరించలేనని సోనియా స్పష్టం చేసినట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అందుకే అక్టోబర్‌లో రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ఖాయమని అంటున్నారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఇప్పుడు సోనియా చుట్టూ ఉన్న సీనియర్ నాయకులందరూ కీలక పదవుల నుండి తప్పుకోవలసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి సీనియర్ నాయకుల ఆలోచనా విధానానికి, రాహుల్ ఆలోచనా విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. సీనియర్ నాయకులు ఇప్పటికే రాహుల్ పని తీరుతో విసిగిపోయారని, రాహుల్ అధ్యక్ష పదవి చేపడితే వాళ్లంతా పార్టీకి మరింత దూరం కావటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నాయకులు క్రియాశీలకంగా పని చేయకపోతే కాంగ్రెస్‌కు తీరని నష్టం వాటిల్లుతుందని వారు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే సీనియర్ నాయకులను దూరంగా పెట్టారు. తన కార్యక్రమాల గురించి వారితో చర్చించటం లేదు. అక్టోబర్‌లో అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ఆయన సీనియర్ నాయకులను మరింత దూరం చేస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది.