జాతీయ వార్తలు

యమునా నదిలో పడవ మునిగి 22 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్‌పట్, సెప్టెంబర్ 14: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 60 మందితో వెళ్తున్న పడవ ఒకటి కథ గ్రామం వద్ద యమునా నదిలో మునిగి పోవడంతో కనీసం 22 మంది చనిపోయినట్లు జిల్లా మేజిఅస్టేట్ భవానీ సింగ్ చెప్పారు. ప్రమాదం వార్త తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 22 మంది మృత దేహాలను వెలికితీశారు. మరోపది మందిని కాపాడారు. మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోంది. సామర్థ్యానికి మంచి జనాన్ని ఎక్కించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని, బోటులో ప్రయాణిస్తున్న వారంతా నిర్మాణ కూలీలేనని, మహిళలే ఎక్కువ మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. కాగా, దుర్ఘటనపై దిగ్భ్రాతి వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితులకు తక్షణ సహాయం అందించాలని, ప్రమాదంపై దర్యాప్తు జరిపించాలని అధికారు లను ఆదేశించారు.

చిత్రం..పడవ మునిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యం