జాతీయ వార్తలు

స్టేని ఎత్తివేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.అయితే ఈ కేసు విచారణను పది వారాలలోపు పూర్తి చేయాలని హైకోర్టుకు అత్యున్నత ధర్మాసనం సూచించింది.కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 16ను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేసింది తెలిసిందే.హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తు ఆర్‌జేడీ కాట్రాక్టు లెక్చరర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.శుక్రవారం నాడు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా,ఖాన్‌వాల్కర్,చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాడానికి ధర్మాసనం నిరకరిస్తూ...ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పది వారాలలోగా పరిష్కరించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ చర్యల తీసుకుంది. ఉమ్మడి ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు ప్రొహిబిషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ చట్టాని సవరించింది.దానిలో భాగంగా 2016 ఫిబ్రవరిలోజీవో 16 తెచ్చింది.2014 జూన్ 2 ముందు నుంచీ పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు చెపట్టింది.దీన్నీ వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేయాగా కాంట్రాక్టు క్రమబద్ధీకరణ విషయంలో స్టేట్ కర్ణాటక వర్సెర్ ఉమాదేవి కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం క్రమబద్ధీకరణ కుదరదంటూ జీవోను హైకోర్టు కోట్టి వేసింది తెలిసిందే.