జాతీయ వార్తలు

అయ్యో.. కాసినీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంపా, సెప్టెంబర్ 15:దాదాపు రెండు దశాబ్దాల పాటు శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ సౌర వ్యవస్థ గురించి మానవ అలోచనల్లో ఎంతో మార్పు తీసుకు వచ్చిన రోదసీ వ్యోమ నౌక కాసినికి నాసా గుడ్‌బై చెప్పింది. 27దేశాలకు చెందిన శాస్తవ్రేత్తల సహకారంతో 3.9బిలియన్ డాలర్లతో అంతర్జాతీయ ప్రాజెక్టుగా కాసిని ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. 7.9బిలియన్ కిలోమీటర్ల దూరం మేర రోదసీ లోతుల్లోకి పయనించిన కాసినిలో ఇంధనం అయిపోవడంతో దానికి అంతిమ ఘడియలు దాపురించింది. ఫలితంగా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన శనిగ్రహ వాతావరణంలోకి వెళ్లిపోయింది. ప్రపంచ రోదసీ పరిశోధకులకు ఈ వ్యోమనౌక చేసిన సేవ ఆసాధారణమే. శనిగ్రహానికి సంబంధించే కాకుండా దాని ఉపగ్రహాలైన ఎన్‌సెలాడస్ వంటి చంద్ర గ్రహాలకు సంబంధించీ ఎన్నో అద్భుత ఛాయాచిత్రాల్ని అందించింది. ఇవన్నీ కూడా భవిష్యత్‌లో రోదసీ పరిశోధనల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఎంతగానో ఉపకరించేవే.‘మా వ్యోమనౌక శనిగ్రహ వాతావరణంలోకి ప్రవేశించింది. దాన్నుంచి తుది సంకేతాలనూ అందుకున్నాం’అని నాసా ఓ ట్వీట్‌లో తెలిపింది. నిజానికి ఈ వ్యోమనౌక అంతిమ ప్రయాణం ఏప్రిల్‌లోనే మొదలైందని, శనిగ్రహం, దాని మధ్య ఉండే వలయాల మధ్య సాగిందని వివరించింది. ఇప్పటి వరకూ శనిగ్రహానికి ఇంత చేరువగా వెళ్లిన వ్యోమనౌకే లేదని, ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని కాసిని మిషన్ మేనేజర్ ఎర్ల్ మైజ్ తెలిపారు. శనిగ్రహ వాతావరణంలో ఓ ఉల్క మాదిరిగా దగ్ధంమయ్యే క్షణం వరకూ ఈ వ్యోమనౌక సంకేతాలు అందిస్తూనే ఉందన్నారు. గంతకు 113,000 కిలోమీటర్ల వేగంతో ఇది శనిగ్రహ వాతావరణంలోకి ప్రవేశించిందని, ఈ గ్రహ ఉపరితలానికి 1,500 కిలోమీటర్ల ఎత్తులోకి కాసిని వెళ్లిన క్షణంలోనే భూమితో సంబంధాలు తెగిపోయాయన్నారు. ఇది జరిగిన 30సెకన్లలోనే ఇది ముక్కలైందని, అది జరిగిన కొన్ని నిముషాల వ్యవధిలో దీని భాగాలన్నీ శనిగ్రహ వాతావరణ ఉష్ణోగ్రతకు ఆహుతైపోయాయని నాసా వివరించింది.