జాతీయ వార్తలు

15 నెలల్లో పేదల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో రానున్న పదిహేను నెలల్లో ఐదు లక్షల పేదల ఇళ్లు నిర్మిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. ఈమేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురికి హామీ ఇచ్చారు. నారాయణ శుక్రవారం కేంద్ర మంత్రి పురితో సమావేశమై రాష్ట్రంలోని పిఎంఏవై ఇళ్లపై చర్చించారు. పిఎంఏవై కింద రాష్ట్రానికి అత్యధిక ఇళ్లు కేటాయించామని, వాటి నిర్మాణం ఏమేరకు పూరె్తైందీ, ఎప్పటిలోగా పూర్తిచేయాల్సి ఉందీ అన్న అంశంపై పురి వాకాబు చేశారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న పదిహేను నెలల్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నారాయణకు సూచించారు. అందుకు నారాయణ బదులిస్తూ ఇళ్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించేందుకే తమకు సమయం పట్టిందని, దీంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకులేనా నిర్మిస్తున్నందునే జాప్యం జరుగుతోందని వివరించారు. షియర్‌వార్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు పురికి నారాయణ వివరించారు. పేదల కోసం పిఎంఏవై కింద కేటాయించిన 5.39 లక్షల ఇళ్లను రానున్న పదిహేను నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి పురికి నారాయణ వివరించారు.