జాతీయ వార్తలు

నెలాఖర్లో రెండవ అణు జలాంతర్గామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15:పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిదమన్‌ను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు భారత్ సిద్ధమవుతోంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జలాంతర్గామిని ప్రారంభిస్తారని, అనంతరం విస్తృత స్థాయి పరీక్షల అనంతరం సైనిక దళాల్లో చేరుతుందంటూ శుక్రవారం కథనాలు వెలువడ్డాయి. 2009లో తొలి అణు జలాంతర్గామి అరిహంత్ సైనిక దళాల్లో చేరింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాల తర్వాత పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అణు జలాంతర్గామిని నిర్మించింది భారత దేశమే కావడం గమనార్హం. ఐఎన్‌ఎస్ అరిదమన్‌కు అరిహంత్ కంటే ఎక్కువ స్థాయిలో క్షిపణులను తీసుకెళ్లే శక్తి ఉంటుందని, అలాగే నీటిలో చాలా వేగంగానే పయనించగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.