జాతీయ వార్తలు

ఐరాసలో అధికార భాషగా హిందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలని కేంద్రీయ హిందీ సంస్థాన సంఘం సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. లక్ష్మీప్రసాద్ శుక్రవారం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐదవ అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో అధ్యక్షోపన్యాసం ఇస్తూ అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఐక్య రాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలని సంకల్పించారని, వాజపేయి సంకల్పాన్ని నేరవేర్చవలసిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేసే ప్రతిపాదనను బలపరచాలని ఆయన విదేశీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన 5వ అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి 40 దేశాల ప్రతినిధులతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు వచ్చారు. హిందీ సంఘం ఫౌండేషన్, అమెరికా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. ఐసిసిఆర్ డైరెక్టర్ జనరల్ రివా గంగూలి దాస్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం హిందీ ప్రొఫెసర్ గాబ్రియేల్ ఇలిఏవ, హిందీ సంఘం ఫౌండేషన్ న్యూయార్క్ అధ్యక్షుడు అశోక్ ఓజా తదితరులు హాజరయ్యారు. దేశంలోని అన్ని హిందీయేతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో హిందీ విభాగాలు ఏర్పాటు చేయాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. వీటి నిర్వహణకు అవసరమయ్యే మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు.