జాతీయ వార్తలు

నన్ను ప్రశ్నించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ‘ఎయిర్‌సెల్ -మాక్సిస్ కేసులో కావాలంటే నన్ను ప్రశ్నించండి. నా కొడుకును మాత్రం వేధించకండి’ అంటూ మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ కేసు దాదాపు ముగిసిపోయినా, దర్యాప్తు సంస్థ మాత్రం తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొస్తుందంటూ శుక్రవారం ఘాటైన ట్వీట్లు చేశారు. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు, ఎయిర్‌సెల్ -మాక్సీస్‌లోకి విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించడంలో చిదంబరం కుమారుడు కార్తి అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ, కేసులో మరింత సమాచారం కోసం గురువారం మరోసారి విచారణకు హాజరుకావాలంటూ కార్తీకి నోటీసులు పంపించింది. అయితే, దర్యాప్తు సంస్థ ఆదేశాలను కార్తి తిరస్కరించారు. కేసులో తనపై వచ్చిన అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టివేసిన కారణంగా, తదుపరి విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆయన సమాధానమిచ్చారు.