జాతీయ వార్తలు

విద్యార్థుల భద్రతపై బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పాఠశాలల్లో విద్యార్థులు లైంగిక వేధింపులకు, హత్యలకు గురికాకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలయిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై స్పందనలు తెలియచేయాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని, అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖన్‌విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరు మహిళా న్యాయవాదులు అభ ఆర్ శర్మ, సంగీత భారతి దాఖలు చేసిన పిల్‌పై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను, అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బస్ కండక్టర్ చేతిలో హతమైనట్లుగా భావిస్తున్న ఏడేళ్ల ప్రద్యుమ్న తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయవాదుల పిల్‌ను సుప్రీంకోర్టు జతచేసింది. గత నెలలో ఘజియాబాద్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన తొమ్మిదేళ్ల బాలుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారిస్తుంది. న్యాయవాది సుజీత శ్రీవాస్తవ ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో బాలుడి మృతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరడంతో పాటు పాఠశాలల పరిధిలో విద్యార్థుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మార్చడానికి వీలులేని మార్గదర్శకాలను పాఠశాలలకోసం రూపొందించేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఢిల్లీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (డిసిపిసిఆర్) సహా అధికారులు ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. పాఠశాలలకు ఉండాల్సిన మార్గదర్శకాల గురించి ప్రస్తావిస్తూ, ప్రతి పాఠశాలకు బాలల హక్కుల విధానం ఉండి తీరాలని ఈ పిటిషన్‌లో కోరారు.