జాతీయ వార్తలు

నెలాఖరుకు కమల్ కొత్త పార్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 15: విలక్షణ నటుడు కమలహాసన్ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించిన కమలహాసన్ సెప్టెంబర్ నెల చివరికల్లా తన సొంత పార్టీని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా దాదాపు రెండు నెలల ముందే సొంత పార్టీపై కమల్ ప్రకటన చేస్తారని చెప్తున్నారు. తాను సొంత పార్టీ పెట్టాలని అనుకుంటున్నట్లు ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలహాసన్ చెప్తూ, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న తన లక్ష్యానికి సరిపోయే వేదికను కానీ, సిద్ధాంతాన్ని కానీ ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదని, అందుకే తాను సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయలేని బంధం ఉందనే విషయం తెలిసిందే.