జాతీయ వార్తలు

రోహింగ్యాలపై 18న సుప్రీంలో అఫిడవిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: మైన్మార్ నుంచి తరలివస్తున్న రోహింగ్యా శరణార్థులకు సంబంధించి సోమవారం సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. రోహింగ్యా ముస్లింల ఆశ్రయానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఈనెల 18న సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తుంది’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. తమకు ఆశ్రయం కల్పించాలని ఇద్దరు రోహింగ్యా వలసదారులు మహ్మద్ సలీముల్లా, మహ్మద్ షాఖీర్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఐక్యరాజ్య సమితి హైకమిషన్ ఆఫ్ రిఫ్యూజీస్ (యుఎన్‌హెచ్‌సిఆర్) వారిద్దరూ రిజిస్టరయినవారే. మైన్మార్‌లో హింస, వివక్షను భరించలేక భారత్‌కు తరలివచ్చారు. తమ దేశ బహిష్కరణ అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా గత నెల 9న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేస్తూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం యుఎన్‌హెచ్‌సిఆర్ వద్ద 14,000 మంది రోహింగ్యాల పేర్లు నమోదు చేసుకున్నట్టు స్పష్టం చేశారు. వారందరూ దేశంలోనే ఉంటున్నారని తెలిపారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది. జమ్మూ, హైదరాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లో అక్రమంగా ఉంటున్నారు. రోహింగ్యాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఐఎస్ ఉగ్రవాదులు వారిని మిలిటెంట్లుగా వాడుకునే ప్రమాదం ఉందని కేంద్రం గురువారం సుప్రీంకు తెలిపింది. కాబట్టి వారిని దేశం నుంచి పంపించే విషయంలో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానాన్ని కోరింది.