జాతీయ వార్తలు

యమునా పడవ ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్‌పట్ (ఉత్తరప్రదేశ్), సెప్టెంబర్ 15: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాలో పడవ తల్లకిందులైన ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు నిర్వహించేందుకు శుక్రవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘటన అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో హింసాత్మక చర్యలకు పాల్పడిన 50 మంది గుర్తుతెలియని వ్యక్తులతో పాటు ఆ పడవను నడుపుతున్న రియాజుద్దీన్ అనే వ్యక్తిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఈ పడవ శుక్రవారం యమునా నదిలో మునిగిపోవడంతో 19 మంది మృతిచెందగా, మరికొందరు గల్లంతయ్యారు. ఈ పడవ ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని, ఎస్‌డిఎం సదర్ వివేక్ కుమార్ ఈ దర్యాప్తును నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ భవానీ సింగ్ తెలిపారు.