జాతీయ వార్తలు

దళారులకు చావుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా ప్రభుత్వం రూ. 57వేల కోట్లు ఆదా చేసిందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గతంలో ఈ మొత్తం మధ్య దళారుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన హర్యానా డిజిటల్ సమ్మిట్‌లో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) సహా అనేక పథకాలను డిబిటితో అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. దీనివల్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే వారికి అందాల్సిన నగదు బదిలీ అవుతోందని వివరించారు. 2017 ఫిబ్రవరి నాటికి డిబిటితో అనుసంధానం చేసిన 84 పథకాల కింద 33 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటుకు తెలియచేసింది. డ్రైవింగ్ లైసెన్సులను, వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. దీనివల్ల ఎవరూ కూడా బహుళ లైసెన్సులు పొందకుండా నివారించడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆధార్ డాటా భద్రతపై ఆయన స్పందిస్తూ, ఐరిస్ స్కాన్, వేలిముద్రల వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని అత్యంత భద్రంగా సంకేత రూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతోందని వెల్లడించారు. ‘నా ఆధార్ కార్డును పరిశీలిస్తే, దానిపై నా ఫొటో, నేను పురుషుడిననే సమాచారం, నా శాశ్వత పాట్నా చిరునామా ఉంటాయి. నా తల్లిదండ్రుల పేర్లు, కులం, మతం, విద్యార్హతలు, ఆదాయం, ఆరోగ్య రికార్డులు దానిపై ఉండవు’ అని మంత్రి వివరించారు. ఆధార్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా చట్టాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి రవిశంకర్ ప్రసాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, స్టార్టప్‌లు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారు. గురుగామ్‌లో స్టార్టప్ ఎకోసిస్టమ్ పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా ఒక స్టార్టప్ గిడ్డంగిని నెలకొల్పాయి.