జాతీయ వార్తలు

డ్రైవింగ్ లైసెన్సుకూ ఇక ఆధార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని త్వరలో తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్‌ను అనుసంధానించడం ద్వారా ప్రభుత్వం ‘సారథి’గా పిలిచే సెంట్రలైజ్డ్ డేటాబేస్‌ను మెయిన్‌టెయిన్ చేసేందుకు వీలవుతుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి దేశంలో ఎక్కడైనా మరో డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉన్నాడా? లేదా? అనే విషయాన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్‌టిఓలు) క్షుణ్ణంగా పరిశీలించగలుగుతాయి. దేశవ్యాప్తంగా ఆర్‌టిఓల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) ఇప్పటికే ఉమ్మడి డేటాబేస్‌లోకి అప్‌లోడ్ చేసింది.