జాతీయ వార్తలు

కార్లున్నోళ్లు పేదవాళ్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 16: ఓ వైపు పెట్రోలు ధరలు మండిపోతూ ఉంటే మరోవైపు పెట్రో ధరల పెంపును సమర్థిస్తూ కేంద్ర మంత్రి అల్ఫోన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కార్లు, బైక్‌లు ఉండే వారే పెట్రోలు కొంటారని, వారేమీ ఆకలితో అల్లాడడం లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రధానపత్రిపక్షమైన కాంగ్రెస్ సైతం మండిపడుతూ బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని, వారికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉండదంటూ మండిపడింది. గత మూడేళ్లలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 శాతం మేర తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం పెట్రోలు, డీజలు ధరలు ఎక్కువగా ఉండడంపై అన్ని వర్గాల ప్రజలనుంచి నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో అల్ఫోన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పన్నుల చెల్లించగలిగే వారిపైనే ప్రభుత్వం పన్నులు వేస్తోంది. కారో, బైకో ఉండే వ్యక్తి కచ్చితంగా ఆకలితో అల్లాడుతూ ఉండడు. పన్నులు చెల్లించగలిగే వారు చెల్లించాల్సిందే’ అని అల్ఫాన్సో శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘ మేము పన్నులు విధిస్తున్నది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవప్రదమైన జీవితాలను అందించడం కోసమే. దేశంలో 30 శాతం మంది రోజులో ఒక పూట పస్తుతోనే గడుపుతున్నారు. చాలామందికి ఇప్పటికీ మరుగుదొడ్డి సదుపాయం లేదు. అలాగే కోట్లాది మందికి సొంత ఇల్లు లేదు. వీరందరినీ ఆదుకోవాలనేది ప్రధాని మోదీ కల. అందుకే ప్రభుత్వం పన్నులు వేస్తోంది. ఈ మార్గంలో వస్తున్న సొమ్మంతా ప్రభుత్వం దోచుకున్నది కాదు. ఎవరైతే పన్నులు చెల్లించగలరో వారిపైనే పన్నులు వేస్తోంది’ అని అల్ఫోన్స్ అన్నారు.
కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. బ్యూరోక్రాట్లు మంత్రులయితే ఇలాగే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ప్రభుత్వాధికారిగా ఏళ్ల తరబడి పని చేసిన వారు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారన్నారు. మోదీ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్లు చాలామంది మంత్రులుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ కూడా ఈ వారం పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలపై ఇదే స్థాయిలో మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోలు ధరలు పెంచితే ‘ఎకనామిక్ టెర్రరిస్టు’ అంటూ బిజెపి నిలదీసిందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తాము అదే ముద్ర వేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.