జాతీయ వార్తలు

ఆర్‌కె స్టూడియోలో అగ్గి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలోని ప్రఖ్యాత ఆర్‌కె స్టూడియోలో శనివారం భారీ అగ్నిప్రమాదం
సంభవించింది. స్టూడియోలోని ఒకటో నెంబర్ హాల్లో విద్యుత్ కార్మికులు పనులు చేస్తుండగా, షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన ప్రాంతానికి అతి సమీపంలో ‘సూపర్ డ్యాన్సర్’ రియాలిటీ షో సెట్ ఉంది. శనివారం షూటింగ్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు రాజ్‌కఫూర్ 1948లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను ప్రస్తుతం రిషీకఫూర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.