జాతీయ వార్తలు

అచ్యుతానందన్‌కే కేరళ సిఎం పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 19: ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు కేరళలో ఈ నెల 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డిఎఫ్) ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యుడిఎఫ్)ను భారీ మెజారిటీతో చిత్తు చేసింది. ఎల్‌డిఎఫ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోను మెదులుతోంది. సిపిఎం తరఫున ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చని భావిస్తున్న వారు ఇద్దరున్నారు. వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కాగా, మరొకరు రాష్ట్ర పార్టీ కార్యదర్శి పినరాయి విజయన్. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పుడు విజయన్‌ను ముఖ్యమంత్రి చేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని సిపిఎం భావించింది. అయితే చివరి నిమిషంలో అచ్యుతానందన్ తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఇబ్బందిలో పడేశారు. అచ్యుతానందన్, విజయన్ ఇద్దరు కూడా సిఎం పదవి చేపట్టాలన్న పట్టుదలతో ఉండడం సిపిఎం కేంద్ర నాయకత్వాన్ని దిక్కు తోచకుండా చేస్తోంది. కేరళ కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం పార్టీ సమావేశమవుతోంది. అయితే అధికారం పంచుకోవడానికి సంబంధించి పార్టీ ఇప్పటికే పార్టీ అనధికారికంగా ఒక అవగాహనకు వచ్చిందని, దీని ప్రకారం 92 ఏళ్ల అచ్యుతానందన్ తొలి రెండేళ్లు పార్టీకి నాయకత్వం వసిస్తారని, విజయన్ ఆ తర్వాతి మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతల్లో ఎవరినీ పార్టీ వదిలిపెట్టుకోలేని పరిస్థితి అని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అయిన అచ్యుతానందన్‌కు పార్టీ అట్టడుగు కార్యకర్తల్లో గట్టి పట్టు ఉంది. అంతేకాదు పార్టీకోసం ఆయన ఎంతో సేవ చేశారు. మరోవైపు విజయన్ మంచి పాలనా దక్షుడిగా గుర్తింపు పొందారు.
బోణీకొట్టిన బిజెపి
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధ్యాయం మొదలైంది. నేమామ్ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఓ రాజగోపాల్ ఘన విజయంతో రాష్ట్రంలో కమలనాధులు బోటీ కొట్టారు. పలు నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు గట్టిపోటీనే ఇచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన రాజగోపాల్ ఈసారి సత్తాచాటారు. నేమామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం సిటింగ్ ఎమ్మెల్యే వి శివన్‌కుట్టిపై 8,671 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజగోపాల్ గెలుపుపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఆయన గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. నేమామ్ కైవసం చేసుకోవడం ద్వారా బిజెపి చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో శివన్‌కుట్టి చేతిలో ఓటమి పాలైన రాజగోపాల్ ప్రతికారం తీర్చుకున్నారు. గతంలో నేమామ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 22 వార్డులకు బిజెపి, ఎల్‌డిఎఫ్‌లు చెరి తొమ్మిది గెలుచుకున్నాయి. యుడిఎఫ్‌కు నాలుగు స్థానాలు దక్కాయి.