జాతీయ వార్తలు

మంత్రివర్గ ఉపసంఘం ‘కాలయాపన’కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 16: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం ‘కాలయాపన’ తప్ప మరోటి కాదని శివసేన అంటూ, రాష్ట్రంలో అనేక నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు జరిగినప్పటికీ మరాఠాలకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ఆగస్టు 9న లక్షలాది మంది మరాఠాలు తమ చిట్టచివరి వౌనప్రదర్శనను నిర్వహించడం తెలిసిందే. మరాఠాలకు అమలు చేస్తున్న వివిధ పథకాలను సమీక్షించడానికి ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటిస్తూ, ఆ మేరకు రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బులెట్ ట్రైన్‌ను సాకారం చేయడానికి ప్రభుత్వ ఖజానానుంచి 30వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఫడ్నవీస్ అంగీకరించారు కానీ, మరాటాల రిజర్వేషన్ల కోసం మాత్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడమనే కాంగ్రెస్ విధానాన్ని అనుసరించారని, అది కాలయాపన కోసం తప్ప మరోటి కాదని ఆ సంపాదకీయం పేర్కొంది.