జాతీయ వార్తలు

గోవా విపక్ష నేతపై అక్రమ ఆస్తుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, సెప్టెంబర్ 16: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావెల్కర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కావెల్కర్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసిబి వెల్లడించింది. 2012లో కాంగ్రెస్ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దానిపై విచారణ జరిపిన తరువాత కావెల్కల్, ఆయన సతీమణిపై కేసు నమోదు చేశారు. తాజా కేసులపై చంద్రకాంత్‌ను వివరణ కోరగా తాను ఎలాంటి తప్పూచేయలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీయాన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. కాగా చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం లేకపోలేదని ఏసిబి సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఆదాయానికి మించి ఐదుకోట్ల రూపాయలు అర్జించినట్టు విచారణలో బయటపడినట్టు ఏసిబి ఎస్పీ బోస్కో జార్జి తెలిపారు. కావెల్కర్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే అదుపులోకి తీసుకుని విచారించాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ నేత, ఆయన భార్య సావిత్రి కూడా కేసులో ఉన్నారని, చంద్రకాంత్ కంపెనీలో ఆమె కూడా ఓ డైరెక్టర్ అని ఎస్పీ పేర్కొన్నారు. సావిత్రికి సమన్లు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఐదున్నర కోట్ల ఆదాయానికి సంబంధించి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని అన్నారు. 2005-2012 వరకూ చంద్రకాంత్ కావెల్కర్ గోవా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.