జాతీయ వార్తలు

మండలి సభ్యుడిగా రేపు యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 16: ఉత్తరప్రదేశ్ శాసన మండలికి ఇటీవల ఎన్నికయిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రివర్గ సహచరులు ఈ నెల 18న (సోమవారం) ఉదయం 11 గంటలకు శాసన సభ భవనంలోని తిలక్ హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారని శాసన మండలి సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి చేడీలాల్ శనివారం ఇక్కడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ వౌర్య, దినేశ్ శర్మ, మరో మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌లు ఈ నెల 8న ఉత్తరప్రదేశ్ శాసన మండలికి పోటీ లేకుండా ఎన్నికయిన విషయం తెలిసిందే. అలాగే మరోమంత్రి మొహిసిన్ రజా సైతం శాసన మండలికి పోటీ లేకుండా ఎన్నికయినట్లు ఈ నెల 11న ప్రకటించారు.