జాతీయ వార్తలు

ఎమ్మెల్సీగా యోగి ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ వౌర్య, దినేశ్ శర్మ కూడా శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయిన ఈ ముగ్గురు ఆయా పదవులు చేపట్టినప్పటి నుంచి ఆరు నెలలలోగా రాష్ట్ర శాసనసభకు గాని శాసనమండలికి గాని సభ్యులుగా ఎన్నికయి తీరాలన్న నిబంధనను పాటించినట్లు అయింది. శాసన మండలి చైర్మన్ రమేశ్ యాదవ్ ఇక్కడి లెజిస్లేటివ్ భవనంలోని తిలక్ హాలులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ముగ్గురితో మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరు మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, మొహ్‌సిన్ రజా కూడా ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 48 మందితో కూడిన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రి మొహ్‌సిన్ రజా. ఈ అయిదుగురూ ఇటీవల శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందే అయిదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలకు వీరంతా ఎన్నికయ్యారు. శాసన మండలికి ప్రాతినిధ్యం వహించిన వరుసగా మూడో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్. గత ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (ఎస్‌పి), మాయావతి కూడా ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించారు. వంద మందితో కూడిన శాసనమండలిలో తాజా ఎన్నికల్లో అయిదు స్థానాలను గెలుపొందడం వల్ల అధికార బిజెపి బలం 13కు పెరిగింది. ఇప్పటికీ ప్రతిపక్షానికే మండలిలో ఆధిక్యత ఉంది. మండలిలో సభ్యులుగా సమాజ్‌వాదీ పార్టీకి 61 మంది, బహుజన్ సమాజ్ పార్టీకి తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఒకరు ఉన్నారు. 12 సీట్లు ఇతరుల చోతుల్లో ఉండగా, 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులు మార్చి 19న ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎస్‌పికి చెందిన నలుగురు, బిఎస్‌పికి చెందిన ఒకరు తమ పదవులకు రాజీనామా చేయడంతో మండలిలో 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. గతంలో ముఖ్యమంత్రులు నారాయణ్‌దత్ తివారి, దివంగత రాంప్రకాశ్ గుప్తా (బిజెపి) కూడా శాసనమండలి మార్గానే్న ఎంచుకున్నారు. 1980లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విపి సింగ్ తొలుత మండలికి ఎన్నికయి, తరువాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

చిత్రం..ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న యోగి ఆదిత్యనాథ్