ఆంధ్రప్రదేశ్‌

ఆ విద్యార్థుల సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: గుర్తింపు కోల్పోయిన ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులను రాష్ట్రంలోని ఇతర వైద్య విద్యా కాలేజీలకు బదిలీ చేసేందుకు భారత మెడికల్ కౌన్సిల్ (ఎంసిఐ) సూత్రప్రాయంగా అంగీకరించిందని వైద్య విద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఒక దఫా మినహాయింపుగా ఫాతిమా వైద్య కాలేజీ విద్యార్థులను రాష్ట్రంలోని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు భారత మెడికల్ కౌన్సిల్ అంగీకరించి, ఇకమీదట ఇలా జరగకుండా చూడాలని స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. ఫాతిమా వైద్య కాలేజీ విద్యార్థులను రాష్ట్రంలోని 19 ప్రభుత్వ కాలేజీలో సర్దుబాటు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను సుప్రీం కోర్టుకు ఇచ్చాం, కోర్టు ఈ నెల 21న ఈ అంశాన్ని పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. భారత మెడికల్ కౌస్సిల్ చైర్మన్‌ను కలిసి ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులను రాష్ట్రంలోని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయటంపై చర్చించి అనుమతి అడిగాం, ఈ ఒక్కసారికి అనుమతి ఇచ్చేందుకు మెడికల్ కౌన్సిల్ అంగీకరించిందని కామినేని శ్రీనివాస్ వివరించారు. ఫాతిమా కాలేజీకి కట్టిన ఫీజును ప్రభుత్వ కాలేజీకి చెల్లించవలసి ఉంటుంది, వీరు చెల్లించే ఫీజును కాలేజీల అభివృద్ధి నిధిలో జమచేయవలసి ఉంటుందని అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు ఈ ప్రతిపాదనను ఆమోదించారని శ్రీనివాస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నాలుగు అంశాలపై భారత మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌తో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. ఫాతిమా వైద్య కాలేజీ విద్యార్థులను ఇతర కాలేజీలో సర్దుబాటు చేయటం మొదట అంశమైతే రెండో అంశం మిగిలిపోయిన 24 సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయటమని శ్రీనివాస్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన 24 సీట్లు మిగిలిపోయాయి, వీటిని డిజిహెచ్‌ఎస్‌కు ఇచ్చి మళ్లీ కౌన్సిలింగ్ చేయించటం లేదా ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయానికి ఇస్తే భర్తీ చేసుకుంటామని భారత వైద్య సమాఖ్య అధ్యక్షుడిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ 24 సీట్లను భర్తీ చేసుకునేందుకు కూడా మెడికల్ కౌన్సిల్ సూత్రప్రాయంగా అంగీకరించిదని శ్రీనివాస్ చెప్పారు. ఇతరచోట్ల కూడా కొన్ని సీట్లు మిగిలినందున వీటన్నింటిని కలిసి భర్తీచేసేందుకు సుప్రీం కోర్టు అనుమతి తీసుకుంటామని ఎంసిఐ చైర్మన్ చెప్పినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఒంగోలులోని రిమ్స్‌కు గుర్తింపు ఇవ్వాలని కోరామని, ఎంసిఐ దీనికి అంగీకరించిందని అన్నారు. సీనియర్ రెసిడెన్స్ వయో పరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు, అయితే ఇన్ సర్వీస్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు కామినేని చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కామినేని