జాతీయ వార్తలు

సీనియర్లకు ఇక సెలవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్గానికి సీనియర్ నాయకులకు మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. మెజారిటీ పదవుల్లో తనవర్గం వారిని నియమించేందుకు రాహుల్ పావులు కదపటంతో సీనియర్ నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సంస్థాగత ఎన్నికల్లో దాదాపు డెబ్బై శాతం పదవుల్లో తన వర్గానికి చెందిన వారిని నియమించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకోసం ఆయన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనని నాయకులకు సైతం పదవులు ఇప్పిస్తున్నట్లు తెలిసింది. మెజారిటీ పదవుల్లో యువతను నియమించేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నం సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు. యువతకు పదవులు ఇవ్వటాన్ని తాము వ్యతిరేకించటం లేదు.. యువత పెరిగిపోయి సీనియర్ నాయకుల సంఖ్య తగ్గిపోతే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. వచ్చే నెలలో తాను అధ్యక్ష పదవి చేపడుతున్నందున పార్టీకి సంబంధించిన మెజారిటీ పదవుల్లో తనవర్గం వారు ఉండవలసిందేనని ఆయన పట్టుపడుతున్నారని అంటున్నారు. పార్టీపై పట్టులేకుండా నాయకత్వం వహించటం అర్థరహితమన్నది రాహుల్ గాంధీ వాదన. తమ ఆలోచనా విధానం ప్రకారం పార్టీ పని చేయాలి, ఈ విధంగా జరగాలంటే సంస్థాగత ఎన్నికల్లో తనవారికి పెద్దపీట వేయవలసిందేనని రాహుల్ స్పష్టం చేసినట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన మొత్తం ప్రక్రియపై తన పట్టును పెంచుకున్నారు. తన సూచనల మేరకు ఏఐసిసి, పిసిసి, పిసిసి డెలిగేట్ల ఎంపిక జరిగేలా చూసుకుంటున్నారు. దీనితోపాటు పిసిసి అధ్యక్షులు, కార్యవర్గంలో తనవారికి సింహభాగం లభించేలా పిఆర్‌ఓ (ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులు)లపై వత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ సంస్థాగత ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి, పిసిసి డెలిగేట్లు, పిసిసి కార్యవర్గం సభ్యులతోపాటు అనుబంధ సంస్థల అధ్యక్షుల పదవికి కూడా రాహుల్ గాంధీ వర్గం వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ వర్గానికి ప్రాధాన్యత లభించేలా చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీ తన ఇష్టానుసారం సభ్యత్యాన్ని నమోదుకాని వారిని ఉన్నత పదవుల్లో నియమించటం వలన కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమస్యలు ఎదురు కావచ్చునని సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం డిసెంబర్‌లోగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించి అందుకు సంబంధించిన దస్తావేజులు, ఇతర పత్రాలను ఎన్నికల కమిషన్‌కు పంపించవలసి ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యత్వ పత్రాలను నిశితంగా పరిశీలిస్తుంది, ఈ పరిశీలనలో బోగస్ సభ్యత్వం జరిగినట్లు నిర్ధారించే పక్షంలో పార్టీ గుర్తింపుకు ప్రమాదం వస్తుందన్నది సీనియర్ నాయకుల ఆందోళన. రాహుల్ గాంధీ వర్గం మాత్రం సీనియర్ నాయకుల వాదనతో ఏకీభవించటం లేదు. పార్టీకోసం పని చేస్తున్నవారికి, పార్టీ అభివృద్ధికోసం కృషిచేసే వారికి రాహుల్ గాంధీ పదవులు ఇప్పిస్తే బాగుంటుంది కానీ పార్టీకి పని చేసినా చేయకపోయినా తాను ఇష్టపడితే చాలనే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించటం మంచిది కాదన్నది సీనియర్ నాయకుల వాదన. సోనియా గాంధీ మరికొంత కాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగటం పార్టీకి ఎంతో అవసరమని సీనియర్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి సోనియా గాంధీ కనుసన్నల్లో కొంతకాలం పని చేయటం మంచిదన్నది సీనియర్ నాయకుల అభిప్రాయం. అయితే రాహుల్ గాం ధీ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించి తాను పూర్తిస్థాయి అధ్యక్షుడిగా మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వర్గం మెజారిటీ పదవులను తన్నుకుపోతే సీనియర్ నాయకులు పార్టీకి దూరం కావటం ఖాయమని అంటున్నారు.