జాతీయ వార్తలు

ఏపీకి త్వరలో కొత్త ఇంచార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యుఢిల్లీ, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ పదవి నుండి తప్పుకున్నట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్ ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత వారం లేఖ రాసినట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్ చాలాకాలంపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా పని చేయటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం ఆగస్టు మొదటి వారంలో దిగ్విజయ్ సింగ్‌ను తెలంగాణ ఇంచార్జ్ పదవినుండి తొలగించి ఆయన స్థానంలో ఆర్‌సి కుంతియాకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. నర్మదా నదీ పరిక్రమ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్న దిగ్విజయ్ సింగ్ కొంతకాలం నుండి పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు. దాదాపు ఆరు నెలలపాటు తాను నర్మదా పరిక్రమ కార్యక్రమంలో ఉంటాను కాబట్టి పార్టీ బాధ్యతలు నిర్వహించటం సాధ్యం కాదని ఆయన పార్టీ అధినాయకత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ బాధ్యతల నుండి కూడా తప్పించిందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కొత్తవారిని నియమించేంత వరకు దిగ్విజయ్ సింగ్ ఏపి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపి కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకోలేకపోతోందని అంటున్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆంధ్రా ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపించటంవల్లనే అధినాయకత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. రాష్ట్ర విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనేదే లేకుండాపోయింది. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ఏపి ఇంచార్జ్‌గా పని చేయటం అగ్ని పరీక్ష లాంటిదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను అక్టోబర్‌లోగా పూర్తి చేయవలసి ఉన్నది. ఈలోగా కాం గ్రెస్ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఇంచార్జ్‌ని నియమిస్తుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.