జాతీయ వార్తలు

దావూద్ పేరుతో బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే, సెప్టెంబర్ 19: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ సన్నిహితులైన ఇద్దరిని ముం బయి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు విషయంలో ఈ చర్య తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. థానేలోని ఓ ప్రముఖ బిల్డర్‌ను దావూద్ ఇబ్రహీం పేరుతో కస్కర్, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఇప్పటివరకూ దాదా పు 30 లక్షల రూపాయలు, నాలుగు ఫ్లాట్లను అతనినుంచి బలవంతంగా తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ముంతాజ్ షేక్, ఇజ్రార్ అలీ, జామెల్ సయ్యద్‌లను అదుపులోకి తీసుకున్నప్పటికీ అధికారికంగా వీరి అరెస్టును ప్రకటిస్తున్నామని థానే కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. అలాగే దావూద్ సోదరి హసీని పర్కర్ సమీప బంధువైన ఇక్బార్ పర్కర్‌ను మాదకద్రవ్య వ్యాపారి మహ్మద్ యాసిన్ క్వాజాలను కూడా ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నామన్నారు.

చిత్రం..దావూద్ పేరుతో బెదిరింపు చేసిన వ్యక్తుల విషయాలను ప్రకటిస్తున్న థానే కమిషనర్ పరమ్ వీర్ సింగ్