అంతర్జాతీయం

దేశాభివృద్ధికి పాటుపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదవువంటే కేవలం ‘పట్టాలు’ పుచ్చుకోవడం కాదు
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడాలి
యువతకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: చదువుకున్నవాళ్లంతా దేశాభివృద్ధికి కృషిచేయాలని, సమాజంలో అట్టడుగున్న ఉన్నవారి అభ్యున్నతికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్బోధించారు. అలాగే మహిళలు విద్యలో రాణిస్తే సమాజంలో అత్యంత కీలకమైన మార్పులు వస్తాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన జేసెస్ అండ్ మేరీ కాలేజీ స్వర్ణోత్సవాల్లో రాష్టప్రతి పాల్గొన్నారు. విద్యను అభ్యసించడం అంటే కేవలం పట్టాలు చేతబుచ్చుకుని పోవడం కాదని, దేశ సంపదను వృద్ధిచేయడంలో తమ వంతు సహకారం అందించాలని అన్నారు. అలాగే మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దితే శ్రద్ధగా పనిచేయడంతోపాటు, తక్కువ బడ్జెట్‌లోనే కార్యక్రమాలు పూర్తిచేస్తారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయని వాటన్నిటినీ అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధం కావాలని అన్నారు. యాభై యేళ్ల కాలంలో జేసెస్ అండ్ మేరీ కాలేజీ సాధించిన విజయాలను ఇతర కళాశాలలు స్ఫూర్తిగా తీసుకుని యువతను తీర్చిదిద్దాలని రాష్టప్రతి పిలుపునిచ్చారు.

బిహార్‌లో కూలిన కెనాల్ గోడ ప్రారంభోత్సవం రద్దు

భగల్‌పూర్/ పాట్నా, సెప్టెంబర్ 20: బిహార్‌లోని భగల్పూర్ జిల్లా బటేశ్వర్‌స్థాన్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో నిర్మించిన సాగునీటి పథకానికి చెందిన కెనాల్ గోడ కూలిపోయింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించ వలసి ఉంది. అయితే కెనాల్ గోడ కూలిపోవడంతో పథకం ప్రారంభోత్సవాన్ని రద్దు చేశారు. ట్రయల్ రన్‌లో భాగంగా మంగళవారం పంప్‌ను ఆన్ చేయడంతో గంగా నది నుంచి తీవ్రమైన ఒత్తిడితో వచ్చిన నీటి ధార కారణంగా గోడ కూలిపోయింది. దీంతో కహల్‌గావ్‌ను గంగానది నీరు ముంచెత్తింది. కహల్‌గావ్‌లో సివిల్ జడ్జి, సబ్ జడ్జి నివసిస్తున్న ప్రాంతంతో పాటు కొన్ని పౌర నివాస ప్రాంతాలు, ఎన్‌టిపిసి టౌన్‌షిప్ జలమయం అయ్యాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగవలసిన గంగా పంప్ కెనాల్ పథకం ప్రారంభోత్సవాన్ని సాంకేతిక కారణాల రీత్యా రద్దు చేసినట్లు పాట్నాలో మంగళవారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని మంగళవారమే కొన్ని వార్తా పత్రికలలో అడ్వర్టయిజ్‌మెంట్లు కూడా ప్రచురితం అయ్యాయి.

జల వనరులు, సాగునీటి పారుదల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లల్లన్ కార్యక్రమంలో పాల్గొంటారని అడ్వర్టయిజ్‌మెంట్లలో పేర్కొన్నారు. కెనాల్ గోడ కూలిపోయినందుకు నిరసనగా ఆర్‌జెడి కార్యకర్తలు భగల్‌పూర్‌లో నితీశ్ కుమార్, లల్లన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని వారు ఆరోపించారు. బిహార్, జార్ఖండ్‌లకు సాగునీటిని అందించేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాయి. ఇదిలా ఉండగా, పౌర నివాస ప్రాంతాలను ముంచెత్తిన నీటిని తోడి వేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

ఏం చర్యలు తీసుకున్నారు?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: నిబంధనలకు విరుద్ధంగా యమునా నదిలో నిమజ్జనం చేసిన వేలాది గణేశ్ విగ్రహాలు నదీ ప్రవాహానికి ఆటంకంగా మారడంతోపాటు నది కాలుష్యానికి కారణమయిన నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) బుధవారం ఢిల్లీ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా నిమజ్జనం చేసిన వేలాది గణేశ్ విగ్రహాలతో నిండిపోయిన యమునా నదిలోనుంచి వాటిని తొలగించి శుభ్రం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆకాశ్ వశిష్ట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేశ్ చతుర్థి నవరాత్రోత్సవాలు ముగిసిన తరువాత తీసుకున్న చర్యలేమిటో వివరిస్తూ నివేదికలు సమర్పించాలని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, ఢిల్లీ జల మండలి, ఢిల్లీ అభివృద్ధి సంస్థ మొదలగు వాటిని ఆదేశించింది. వినాయక నవరాత్రుల సందర్భంగా, నవరాత్రులు ముగిసిన తరువాత పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఇప్పటికీ పగిలిపోయిన, పాక్షికంగా కరిగిపోయిన వేలాది విగ్రహాలు యమునా నదిలో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసి, మెర్క్యురి, కాడ్మియం, సీసం, కార్బన్ వంటి ప్రమాదకరమైన రసాయనాల పూత పూసినవి కావడం గమనార్హం. గణేశ్ నిమజ్జనానికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మడలి (సిపిసిబి) 2010లోనే మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ప్రత్యేకించి పర్యావరణానికి ముప్పు కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనంపై ట్రిబ్యునల్ ఇదివరకే నిషేధం విధించినప్పటికీ, వాటిని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. మీడియా కథనాలను ఉదహరిస్తూ, నిమజ్జనమైన గణేశ్ విగ్రహాలు, పూజా సామగ్రితో నిండిపోయిన యమునా నది మురుగు నీటి కాలువను తలపిస్తోందని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే క్రమంగా దెబ్బతింటున్న యమునా నది.. పెద్ద సంఖ్యలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల వ్యర్థ పదార్థాలతో నిండిన డంప్‌యార్డ్ మాదిరిగా మారిపోయిందని వివరించారు.

ఎన్‌డి తివారీకి బ్రెయిన్ స్ట్రోక్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కేంద్ర మాజీ మంత్రి ఎన్‌డి తివారీ బ్రెయిన్ స్ట్రోక్‌తో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురైన తివారీ (91)ని సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్టు ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ వెల్లడించారు. తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖంఢ్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు కుమారుడు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తివారీకి వైద్య సేవలు అందిస్తున్నారు. బుధవారం ఉదయం ఇంట్లో టీ తాగిన తరువాత ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని రోహిత్ చెప్పాడు.

ఇండో-పాక్ సరిహద్దులో ఇద్దరు చొరబాటుదార్ల హతం
అమృత్‌సర్, సెప్టెంబర్ 20: ఇండో-్భరత్ సరిహద్దులో ఇద్దరు చొరబాట్లు దారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు పాకిస్తానీయులు సరిహద్దు దాటుతూ భద్రతా దళాల కంటబడ్డారు. వెంటనే లొంగిపోమ్మని హెచ్చరించినా పెడచెవిన బెట్టడంతో కాల్పులు జరిపినట్టు బిఎస్‌ఎఫ్ డిఐజి జెఎస్ ఒబెరాయ్ వెల్లడించారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు దూసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. షాహాపూర్ బిపిఓలోని అంజాలా సెక్టార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు బిఎస్‌ఎఫ్ అధికారులు చెప్పారు. సంఘటనా స్థలంనుంచి ఎకె-47 రైఫిల్, పిస్తోల్, రెండు డజన్ల బులెట్ల రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌కార్డు, నాలుగు కిలోల హెరాయిన్, 20వేల రూపాయల పాకిస్తాన్ కరెన్సీ లభించినట్టు బిఎస్‌ఎఫ్ ప్రతినిధి చెప్పారు. తాము కనిపించగానే చొరబాటుదారులిద్దరూ కాల్పులు మొదలెట్టారని, అత్యాధునిక ఆయుధాలు వారివద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

బెంగాల్ నటిపై లైంగిక వేధింపులు
కారులోంచి దించేసి ఘాతుకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా కోల్‌కతాలో జరిగిన ఘటన మరింత ఆందోళనకు గురిచేసింది. బెంగాల్ ప్రముఖ నటి కాంచనా మోత్రా షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారు సిరిటీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే ముగ్గురు తాగుబోతులు ఆపేశారు. బలవంతంగా డోర్ తెరిచి కారు తాళాలు లాగేసుకున్నారు. కాంచన శరీరాన్ని తాకుతూ లైంగిక చేష్టలకు దిగారు. డ్రైవర్‌పైనా చేయిచేసుకున్నారు. ఆకతాయుల ఆగడాలతో తాను నరకం చూశానని నటి ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రాత్రి జరిగిందంతా ఓ వార్తా సంస్థకు కాంచన వివరించింది. కారు సిరిటీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే తాగుబోతులు తెగబడ్డారని, డ్రైవర్‌ను కిందపడేసి కొట్టారని ఆమె పేర్కొన్నారు. తాము తప్పుచేసి ఉంటే క్షమించమని అభ్యర్థించినా వినకుండా డ్రైవర్ చేతులు వెనక్కిఅతడి చేతులు వెనక్కి మడిచిపట్టుకుని పిడిగుద్దులు కురిపించారని తెలిపారు. అందులో ఒకడు తన భుజం పట్టుకుని వికృతంగా ప్రవర్తించాడని కాంచన చెప్పారు.
మొత్తానికి తాగుబోతుల నుంచి బయటపడి బెహాలా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కేసులోఇద్దర్ని అరెస్టు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ మీరాజ్ ఖలీద్ తెలిపారు. ఇద్దరినీ రెండు రోజుల పోలీసు కస్టడికి తరలించారు. మరొకని కోసం గాలిస్తున్నట్టు డిసి వెల్లడించారు.