జాతీయ వార్తలు

ఢిల్లీకి పొంచివున్న నీటి ఎద్దడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశ రాజధాని ఢిల్లీలో భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాల క్షీణతపై స్పందించిన ట్రిబ్యునల్ దీన్ని అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని స్థానిక అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించింది. నీటి ఎద్దడిని ఎదుర్కోడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా ప్రతిపాదలు సిద్ధం చేశారా అన్నదానిపై వివరణ ఇవ్వాలని ప్యానెల్ సూచించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీలకు నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్‌జిటి ఆదేశించింది. ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ నగర పాలక సంస్థ, సిజిడబ్ల్యూఏ, సంబంధిత విభాగాలకు నోటీసులు ఇచ్చారు. భూగర్భ జలాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘అక్రమ బోర్లు వేసుకుని, నీటిని తోడేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టుతప్పింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని న్యాయమూర్తి ఆదేశించారు. దక్షిణ ఢిల్లీ, నైరుతీ ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. 265 చ.కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఘోరంగా పడిపోయాయి.