జాతీయ వార్తలు

పాక్‌లో నాలుగిళ్లు మారిన దావూద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: అండర్ వరల్డ్ డాన్, 1993నాటి ముంబయి పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకడయిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్ బైటపెట్టాడు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దావూద్ పాకిస్తాన్‌లో తాను ఎక్కడ ఉండేది తెలియకుండా ఉండేందుకు నాలుగుసార్లు ఇళ్లు మారాడని కూడా అతను పోలీసు అధికారులకు చెప్పాడు. అంతేకాదు పాకిస్తాన్‌లో దావూద్ భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పాడు. భారత భద్రతా ఏజన్సీలు తన ఫోన్ సంభాషణలను రికార్డు చేయకుండా ఉండడానికి దావూద్ ఫోన్‌లో తన బంధువులతో మాట్లాడడం కూడా మానేసినట్లు కస్కర్ పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కస్కర్ దావూద్ మరో సోదరుడు అనీస్ ఇబ్రహీంతో కలిసి అతని కార్యకలాపాలను సమన్వయం చేస్తుంటాడు.
అమెరికా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించిన దావూద్ ఇబ్రహీంకు లాటిన్ అమెరికా దేశాల్లోని డ్రగ్స్ సామ్రాజ్యం నేతలతోను సంబంధాలున్నాయని కూడా కస్కర్ పోలీసుల ముందు బైటపెట్టినట్లు చెప్తున్నారు. ముంబయిలో బడా వ్యాపారులు, ధనవంతులను బెదిరించి డబ్బులు గుంజే రాకెట్‌తో ప్రస్తుతం పరారీలో ఉన్న దావూద్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమయినా సంబంధాలున్నాయా, అతడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చవచ్చా అనే విషయంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు దావూద్ సోదరుడు ఈ విషయాలన్నీ బైటపెట్టాడు. దక్షిణ ముంబయిలోని కస్కర్ నివాసంలో అతడ్ని పోలీసులు గత సోమవారం ఒక హై సెక్యూరిటీ ఆపరేషన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2003లో యుఏఇనుంచి భారత్‌కు పంపించి వేసిన ఇక్బాల్ కస్కర్ ముంబయిలో తన సోదరుడి రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలను చూస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

చిత్రాలు.. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను థానేలోని ప్రత్యేక సెల్‌కు తరలిస్తున్న ముంబయ పోలీసులు
*ఇన్‌సెట్‌లో దావూద్