జాతీయ వార్తలు

మహిళా బిల్లు ప్రవేశపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వు చేసేందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించి ఆమోదం తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ గురువారం ఈ మేరకు నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2010లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేయటం తెలిసిందే. రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లు 2010 నుండి లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు రకరకాల కారణాలతో లోక్‌సభ ఆమోదం పొందలేకపోయింది. ఎన్‌డిఏకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ ఉన్నందున మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తీసుకోవాలని సోనియా గాంధీ ప్రధాన మంత్రికి సూచించారు.
సోనియా లేఖ పూర్తిపాఠం
‘రాజ్యసభ మహిళా రిజర్వేషన్ల బిల్లును 2010 మార్చి తొమ్మిదో తేదీనాడు ఆమోదించటం మీకు తెలిసిందే. అప్పటినుంచి ఈ బిల్లు రకరకాల కారణాలతో లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తీసుకునేందుకు మీకున్న మెజారిటీని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అత్యంత ముఖ్యమైన అడుగు వేసేందుకు వీలు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్వదా సిద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా నగర పాలికలు, పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను మొదట కాంగ్రెస్ మాజీ నాయకుడు రాజీవ్ గాంధీ చేశారనేది మీకు తెలిసిందే. నగర పాలికలు, పంచాయితీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు 1989లో రాజ్యసభలో దెబ్బతీసినా 1993లో పార్లమెంటు ఉభయ సభలు రాజ్యాంగం 73, 74 సవరణ బిల్లును ఆమోదించాయి’ అని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీకి సోనియా గాంధీ బుధవారం రాసిన లేఖను కాంగ్రెస్ పార్టీ గురువారంనాడు పత్రికలకు విడుదలు చేసింది. సోనియా గాంధీ అకస్మాత్తుగా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాన మంత్రికి ఎందుకు లేఖ రాశారనేది చర్చనీయంశంగా మారింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు లేఖ రాస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎందుకు రాశారనేది అర్థం కావటం లేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ నాలుగో వారంలో ప్రారంభమై డిసెంబర్ నాలుగో వారంలో ముగుస్తాయనేది అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నవంబర్‌లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రజలు ముఖ్యంగా మహిళల వద్దకు వెళ్లేందుకు కార్యక్రమం రూపొందించుకుంటోందనీ, దీనికోసమే సోనియా గాంధీ ఇప్పుడు ప్రధాన మంత్రికి లేఖ రాసి ఉంటారని బిజెపి అనుమానిస్తోంది.