జాతీయ వార్తలు

క్లూ ఇస్తే ...కోటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22:బినామీ ఆస్తులకు సంబంధించి రహస్య సమాచారాన్ని అందిచే వారికి కోటి రూపాయల నజరానా ఇచ్చే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బినామీ ఆస్తులపై దర్యాప్తు జరుపుతున్న ఏజెన్సీలకు కీలక సమాచారాన్ని ఇచ్చేవారికి కోటి నగదు బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సిబిడిటి వర్గాలు తెలిపాయి. బినామీ ఆస్తుల సమాచారాన్ని ఇచ్చే వారికి కనీసం 15 లక్షల నుంచి గరిష్ఠ స్థాయిలో కోటి రూపాయల వరకూ బహుమతిని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఆస్తుల సమాచారం కీలకమైనదిగా ఉండాలని, దాన్ని అందించే వ్యక్తుల పేర్లను పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతామన్నారు. గత ఏడాది ప్రవేశ పెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఈ ప్రోత్సాహకం లేదు. అయినా ఈ రకమైన కీలక సమాచారాన్ని అందించే వారికి రివార్డులు ఇవ్వడం ఆదాయం పన్ను, రెవిన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లలో ఆనవాయితీగానే వస్తోందని తెలిపారు.