జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి ఆపరేషన్‌కు ఇస్రో సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 22: ఇటీవల జరిపిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నవంబర్-డిసెంబర్ నెలలో మరోసారి పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికి సిద్ధమవుతోంది. 68వ భారత జాతీయ ఏరోనాటికల్ సొసైటీ సమావేశం సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. పిఎస్‌ఎల్‌వి-3సి39 మిషన్ ఎందుకు విఫలమైందన్నదానిపై ఓ కమిటీని నియమించామని ఈ అధ్యయన నివేదిక తుది దశకు చేరుకుందని తెలిపారు. వైఫల్యకారణాలను కచ్చితంగా నిర్ధారిస్తామని తదుపరి ప్రయోగాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపగ్రహ ప్రయోగంలో ఎలాంటి లోపం లేదని హీట్ షీల్డ్‌లోనే అసలు సమస్య తలెత్తి ఉండొచ్చని కిరణ్ అన్నారు. ప్రయోగ వాహకాల నియంత్రణ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. ఏరోస్పేస్ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించినప్పటికీ అలాగే ప్రయోగ వాహకాలు, క్షిపణి టెక్నాలజీ విషయంలోనూ ప్రగతిని నమోదు చేసుకున్నప్పటికీ ప్రయాణికుల విమానరంగంలో అనుకున్న స్థాయి అభివృద్ధి నమోదుకాలేదని చెప్పారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని, ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అని అన్నారు.