జాతీయ వార్తలు

13కు తగ్గనున్న బిజెపి జిల్లా యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, సెప్టెంబర్ 22: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తన జిల్లా యూనిట్ల సంఖ్యను 23 నుంచి 13కు తగ్గించాలని బిజెపి నిర్ణయించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల రెండు రోజుల పాటు చేసిన రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ జిల్లా యూనిట్ల సంఖ్యను 13కు పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ప్రభుత్వపరంగా పాలన కోసం రాష్ట్రంలో 13 జిల్లాలే ఉన్నందున, అందుకు అనుగుణంగా బిజెపి జిల్లా శాఖల సంఖ్యను కూడా 13కు కుదించాలని అమిత్ షా భావించారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ నెల 24, 25 తేదీలలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానంతరం రాష్ట్రంలోని పార్టీ జిల్లా యూనిట్ల వర్కింగ్ కమిటీలను పునర్ వ్యవస్థీకరించి, వాటి ఆఫీస్ బేరర్లను ప్రకటిస్తామని భట్ వివరించారు.