జాతీయ వార్తలు

షరీఫ్, కుటుంబ సభ్యుల ఖాతాలు, ఆస్తులు జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతుడైన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్, ఆయన సన్నిహిత కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని, ఆస్తులను జప్తు చేయాలని పాక్ అవినీతి నిరోధక సంస్థ అయిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌బిఏ) ఆదేశించింది. షరీఫ్, ఆయన పిల్లలు, అల్లుడు కెప్టెన్ (రిటైర్డ్) సఫ్దర్‌లు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నందున వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని స్టేట్ బ్యాంట్ ఆఫ్ పాకిస్తాన్, ఇతర వాణిజ్య బ్యాంకులకు లేఖలు రాసినట్లు ఎన్‌బిఏకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు తోడుగా షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్న కారణంగా లాహోర్ శివార్లలోని ఆయన ఇంటికి సమన్లు, ఆస్తుల జప్తు నోటీసులను అతికించారు. షరీఫ్ లండన్‌నుంచి స్వదేశానికి తిరిగి రాకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికార పిఎంఎల్-ఎన్ పార్టీ మాత్రం ఆయన తప్పకుండా వస్తారని హామీ ఇస్తోంది. ఈ నెల 26న కోర్టు ఎదుట హాజరు కావాలని షరీఫ్‌ను, ఆయన కుమార్తె మరియమ్, అల్లుడు సఫ్దర్‌లను పూచీకత్తు (అకౌంటబిలిటీ) కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.