జాతీయ వార్తలు

బెడిసికొట్టిన రాహుల్ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: అసోం, కేరళ రాష్ట్రాల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం మరోసారి ప్రశ్నార్థకం కావటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ నాయకత్వంలో బతికి బట్టకట్టగలుగుతామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాహుల్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. తమిళనాడులో డిఎంకె, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు రాహుల్ పన్నిన వ్యూహం కుప్పకూలటంతో పార్టీని ముందుకు నడిపించగలుగుతారా లేదా అనే అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభం కాగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా సీనియర్ నాయకులతో రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని పార్టీ అధినాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
అసోంలో ఘోర పరాజయం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు. తరుణ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ నాలుగోసారి అధికారంలోకి వస్తుందని పార్టీ అధినాయకత్వం భావించింది. బిజెపి పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగటంతో రాష్ట్రంలోని మైనారిటీలందరూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారనుకున్నారు. అయితే ఓటర్లు బిజెపి కూటమివైపే మొగ్గుచూపడం కాంగ్రెస్‌కు పాలుపోవటం లేదు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ ఓడిపోతుందని అంచనా వేసినా ఇంత ఘోరంగా ఓడిపోతామని కాంగ్రెస్ నాయకులు అనుకోలేదు. అయితే కేరళ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు భారీ మెజారిటీ ఇవ్వటంతో కాంగ్రెస్ కుదేలయ్యింది. తాజా ఫలితాలతో కాంగ్రెస్ కర్నాటకతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు పరిమితమైపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు చిన్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా మారిపోవటం పార్టీ నాయకులకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు.
సోనియా, రాహుల్ నాయకత్వంలోనే..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీ అధినాయకత్వంపై రిఫరెండం కాదని పార్టీ అధికార ప్రతినిధులు రణదీప్‌సింగ్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్ స్పష్టం చేశారు. ఇరువురు నాయకులు గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. ఫలితాలను విశే్లషించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని సుర్జేవాలా స్పష్టం చేశారు.