జాతీయ వార్తలు

‘నిధి’ నిర్వహణ తీరు ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అత్యాచార బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన నిర్భయ నిధి వినియోగానికి సంబంధించి ఓ విధానమంటూ లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంలో పరిస్థితి దారుణంగా ఉందని ఏ రకమైన స్పష్టత లేదని తెలిపింది. ఈ బాధితులకు ఏ దశలో ఏవిధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలన్న దానిపై విధివిధానాలు లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితులకు కేటాయించేందుకు ఉద్దేశించిన నిధుల పంపిణీ, నిర్వహణ విషయంలో ఓ సమీకృత వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2013లో నిర్భయ నిధిని ఏర్పాటుచేసింది. మహిళల సంరక్షణ, భద్రత, గౌరవ పరిరక్షణ తదితర కీలక అంశాలపై పనిచేస్తున్న ఎన్‌జిఓ సంస్థలు ప్రభుత్వం చేపట్టే విధానాలను అమలుచేయడానికి ఈ నిధిని ఏర్పాటుచేసింది. అయితే దీని నిర్వహణ, బాధితులకు నష్టపరిహార పంపిణీకి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, మహిళా శిశు సంక్షేమ విభాగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఈ రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఈ మూడు శాఖలకు ఏర్పడిందని న్యాయమూర్తులు మదన్ లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఈ పథకం కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులను సమకూరుస్తున్నప్పటికీ లైంగిక బాధిత మహిళలకు ఏ దశలో ఏవిధంగా నష్టపరిహారం చెల్లించాలన్న దానిపై స్పష్టత అంటూ లేకుండాపోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యంత కీలకమైన ఈ నిధి నిర్వహణ విషయంలో ఈ రకమైన గందరగోళం ఎంతమాత్రం మంచిది కాదని తెలిపింది. ఈ నిధిని అర్థవంతమైన రీతిలో నిర్వహించేందుకు నష్టపరిహారం సకాలంలో అందించేందుకు పునరావాసాన్ని కల్పించేందుకు ఏరకమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీనియర్ అధికారులను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.