జాతీయ వార్తలు

అంజలి దమానియాకు పాక్‌నుంచి బెదిరింపు కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 23: ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అంజలి దమానియాకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి బిజెపి నేత ఏక్‌నాథ్ ఖాడ్సెకు వ్యతిరేకంగా ఆమె వేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. కాల్ వచ్చిన నెంబర్‌ను ట్రూకాలర్ యాప్ ‘దావూద్’ ఫోన్‌గా గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాంతాక్రజ్ సబ్‌అర్బన్ ప్రాంతంలోని వకోలా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ‘రాత్రి 12.33 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ ముందు +92కోడ్ ఉండడంతో అది పాకిస్తాన్ నుంచే వచ్చింది. ట్రూకాలర్ యాప్ ఆ ఫోన్ రిజిస్టర్ అయిన పేరును ‘దావూద్-2’గా గుర్తించింది’ అని ట్విట్టర్‌లో దమానియా వివరించారు. వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ చేశానని, జాయింట్ కమిషనర్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే పోలీసు కమిషనర్‌కు కూడా ఈ విషయం తెలిపానని అన్నారు. ఇది జరిగిన గంటకు పోలీసులు వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఇలావుండగా ఈ నెల మొదట్లో మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సె అక్రమాస్తులు సంపాదించారని పేర్కొంటూ అంజలి దమానియా కేసును ఫైల్ చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దమానియా ఫిర్యాదు మేరుకు పోలీసులు ఐపిసి 506, 507 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.