జాతీయ వార్తలు

మళ్లీ తెగబడిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, సెప్టెంబర్ 23: పాకిస్తాన్ బలగాలు శుక్రవారం రాత్రంతా జమ్ము, సాంబా, పూంచ్ జిల్లాల్లోని భారత సరిహద్దు ఔట్‌పోస్టులను, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాయి. ఫిరంగి గుండ్లను కురిపించాయి. ఈ దాడుల్లో భారత సరిహద్దు దళం (బిఎస్‌ఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లు, అయిదుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దు (ఐబి), నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంట ఎడతెగకుండా కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ ఇళ్లను వదలి పారిపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ బలగాలు జమ్ము, సాంబా జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట గల ఆర్నియా, ఆర్‌ఎస్ పురా, రాంగఢ్ సెక్టార్లలో గల గ్రామాలపై, భారత సైనిక ఔట్‌పోస్టులపై శుక్రవారం సాయంత్రం నుంచి పెద్దఎత్తున కాల్పులు జరిపాయని, ఫిరంగుల గుండ్లు కురిపించాయని అధికారులు తెలిపారు. పాక్ బలగాలు 20 గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డాయని పేర్కొన్నారు. పాక్ పేల్చిన ఫిరంగుల గుండ్లు తాకి ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని సతోవలి గ్రామంలో ముగ్గురు పౌరులు గాయపడి, ఆసుపత్రి పాలయ్యారు. ఆర్నియా సెక్టార్‌లోని ట్రేవ గ్రామంలో మరొకరు గాయపడ్డారని చెప్పారు. సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్‌లో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు స్వల్పంగా గాయపడ్డారు. పాకిస్తాన్ బలగాలు పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట కూడా శుక్రవారం సాయంత్రం నుంచి తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపాయని, ఫిరంగి గుండ్లను కురిపించాయని అధికారులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డారని వివరించారు. పాక్ బలగాలు లక్ష్యంగా చేసుకున్న కొన్ని సరిహద్దు గ్రామాల నుంచి పోలీసులు శుక్రవారం రాత్రి 500కు పైగా మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వీరంతా సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న కాల్పుల వల్ల ఆర్నియా, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని 20వేలకు పైగా మంది తమ ఇళ్లను వదలిపోయారు.

చిత్రం.. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పగిలిన ఇంటి అద్దాలను చూపుతున్న బాధితుడు