జాతీయ వార్తలు

అత్యాచారం కేసులో ఫలహారీ బాబా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 23: న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న అభియోగంపై రాజస్థాన్‌లోని ఫలహారీ బాబాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆల్వార్‌లోని మధుసూదన్ ఆశ్రమానికి వెళ్లిన తనపై స్వామి కౌశలేంద్ర ప్రపన్నాచారి ఫలహారీ మహారాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కొద్దిరోజుల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో అనారోగ్యం సాకుతో ప్రపన్నాచారి ఆస్పత్రిలో చేరాడు. అయితే, వైద్య పరీక్షల్లో స్వామి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ముగ్గురు వైద్య నిపుణుల బృందం తేల్చడంతో, ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆరావళి ఎస్‌ఐ హేమ్‌రాజ్ మీనా కథనం ప్రకారం ఆల్వార్‌లోని మధుసూదన్ ఆశ్రమంలో గత ఆగస్టు 7న తనపై ప్రపన్నాచారి బాబా అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 21 ఏళ్ల న్యాయ విద్యార్థిని సెప్టెంబర్ 11న ఫిర్యాదు చేసిందని బిలాస్‌పూర్ ఏఎస్పీ అర్చనా జా వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ అందించిన వివరాల ప్రకారం, యువతి తల్లిదండ్రులు గత కొనే్నళ్లుగా ఫలహారీ బాబా భక్తులు. బాబాను దర్శించుకుని రావాలన్న తల్లిదండ్రుల సూచనతో గత నెల రక్షాబంధన్ రోజున మధుసూదన్ ఆశ్రమానికి వెళ్లింది. అదేరోజు గ్రహణం కావడంతో, ఆశ్రమంలో నిద్రచేసి వెళ్లడం మంచిదని బాబా సూచించాడు. రాత్రి సమయంలో తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఏఎస్పీ జా వెల్లడించారు. అరెస్టయిన ప్రపన్నాచారి ఫలహారీ బాబాపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 506 (నేర కుట్ర) కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.