జాతీయ వార్తలు

కేరళ పాల ఉత్పత్తి లక్ష్యాలకు గోరక్షకుల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 24: పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గోరక్షకులు అవరోధంగా మారారని కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పాల దిగుబడిని ఇచ్చే గుజరాత్‌కు చెందిన గిర్ ఆవులను దిగుమతి చేసుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ నుంచి రోడ్డు రవాణా ద్వారా ఆవులను తీసుకురావాల్సి వుందని, అయితే గోరక్షకుల నుంచి ముప్పు పొంచివున్నందున ఈ ప్రణాళికను ప్రస్తుతానికి వాయిదా వేశామని తెలిపారు. పాల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలంటే గిర్ జాతుల ఆవులే శ్రేష్ఠమని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచే కాదు, దేశంలో ఎక్కడినుంచైనా ఆవులను తరలించాలంటే గోరక్షకుల పేరిట అడ్డుతగిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘గుజరాత్ నుంచి ఆవుల కొనుగోలు ప్రణాళికను నిలిపివేయలేదు. ఈ అంశాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నాం. ఎలా తీసుకురావాలన్న దానిపై పునరాలోచించేందుకు మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశాం’ అని రాజు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో వున్న గిర్ అటవీ ప్రాంతానికి చెందిన గిర్ జాతి ఆవులు అధిక పాల దిగుబడికి ప్రసిద్ధి. తొలి దశలో 200 గిర్ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు కేరళ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆవులను రైతులనుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు, ఒక్కో ఆవుకు లక్షకు పైగా చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ఇందుకు సంబంధించి గుజరాత్ సందర్శించి సంబంధిత మంత్రితో రాజు చర్చలు జరిపారు. గుజరాత్ సరిహద్దు వరకు తరలించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అక్కడినుంచి మీరే బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారని రాజు వెల్లడించారు. మహారాష్ట్ర మీదుగా కేరళకు చేరుకోవాల్సి ఉందని, అయితే గోరక్షకుల నుంచి బెడద ఉన్నందున పునరాలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గోవులను కొనుగోలు చేసేందుకే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.