జాతీయ వార్తలు

మరో నలుగురికి ఎన్‌ఐఏ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నారన్న సమాచారం మేరకు కాశ్మీర్ యూనివర్సిటీలో పిహెచ్‌డి చదువుతున్న ఓ విద్యార్థికి, వాణిజ్య సంఘాల నేతకు, ఇద్దరు హురియత్ నేతలకు సోమవారం హాజరు కావాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. కాశ్మీర్ ట్రేడర్స్, మార్కెటింగ్ ఫెడరేషన్ నేత యాసిన్ ఖాన్, కాశ్మీర్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న ఆలా ఫజిల్, హురియత్ కాన్ఫరెన్స్‌కు చెందిన అబ్దుల్ హమీద్ మాగ్రే, వాలీ మొహమ్మద్‌కు ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. యాసిన్ ఖాన్‌కు సమన్లు జారీ చేసినందుకు నిరసనగా సోమవారం బంద్‌కు కాశ్మీర్ ట్రేడర్స్ సంఘం పిలుపునిచ్చింది. ఇలావుండగా కాశ్మీర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మియాన్ కయూమ్‌కు కూడా ఎన్‌ఐఏ నోటీసు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమన్లు అందుకున్నవారు సోమవారం ఎన్‌ఐఏ ముందు హాజరుకాగానే ఉగ్రవాదులకు ఏ విధంగా నిధులు అందజేస్తున్నారనే విషయమై సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఉగ్రవాదులకు నిధుల అందజేస్తున్నారనే ప్రాథమిక సమాచారం మేరకు పైన పేర్కొన్న వారందరిపై మే 30నే ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ రకమైన ఆరోపణలపై ఇప్పటికే పది మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.