జాతీయ వార్తలు

బిహెచ్‌యులో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి / లక్నో, సెప్టెంబర్ 24: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో శనివారం రాత్రి పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో పలువురు విద్యార్థులతోపాటు ఒక మహిళ, ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఈ సంఘటనతో సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు యాజమాన్యం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. ఈ సంఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డివిజనల్ కమిషన్‌ను వివరణ కోరారు. గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈవ్ టీవింగ్‌కు సంబంధించి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీనికి సంబంధించి ఒక వర్గం శనివారం రాత్రి వైస్‌చాన్సలర్‌ను కలుసుకునేందుకు ఇంటికి వచ్చారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. ఇంతలోనే విద్యార్థుల వైపునుంచి రాళ్లదాడి జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వీరితోపాటు ఒక మహిళ, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. జర్నలిస్టులపై పోలీసుల దాడికి నిరసనగా ఆదివారంనాడు ముఖ్యమంత్రి నివాసం వద్ద కొంతమంది విలేఖరులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి జర్నలిస్టులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారంనాడు యూనివర్సిటీలో ప్రాంగణంలోకి ఒక బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు మహిళా విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. అయితే వీరికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆకతాయిలను నిరోధించలేదని విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు యూనివర్సిటీలో పునరావృతం అవుతున్నా యాజమాన్యం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఇలా లాఠీలు ప్రయోగించడం మంచి పద్ధతి కాదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ సంఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బిజెపి నినాదం ‘్భటీ బచావో, భేటీ పడావో’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మహిళా విద్యార్థులను వేధించినవారిని శిక్షించకుండా, విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ఏమిటని నిలదీశారు. జెడి(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ, ‘బిహెచ్‌యులో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదని, విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అంటే, అది వారి గొంతు నొక్కే ప్రయత్నమే’నని తీవ్రంగా విమర్శించారు. ఈ సంఘటనను పార్లమెంటులో లేవదీస్తామని అన్నారు.

చిత్రం.. *లాఠీ చార్జీపై ఆదివారం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు