జాతీయ వార్తలు

ప్రజల మనోభావాలకు అద్దం పట్టా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ప్రతి నెలా తాను రేడియో ద్వారా ఇస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం పట్ల ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ప్రజల స్పందనను రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతిఫలింపజేయడానికే ప్రయత్నించానని తన మనసులోని భావలను మరోసారి వ్యక్తం చేశారు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం 36వ ఎపిసోడ్ సందర్భంగా ఆదివారం ప్రధాని అరగంట సేపు ప్రసంగించారు. ఈ కార్యక్రమం కోసం విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక శాస్తవ్రేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు, మీడియా నిపుణులు ఈ కార్యక్రమం మంచిచెడ్డలను విశే్లషిస్తారన్న నమ్మకం తనకుందని, అలాంటి విశే్లషణ ఈ కార్యక్రమానికి ఎంతో ప్రయోజనకారి అవుతుందని అన్నారు. మూడేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా తాను లేవనెత్తిన అనేక అంశాలను గుర్తుచేసుకోవడంతోపాటుగా స్వచ్ఛ భారత్‌కోసం చేపట్టిన ఉద్యమం గురించి మాట్లాడారు. యువకులంతా భారత దేశమంతటా పర్యటించి, వివిధ ప్రాంతాల్లో ఉన్న భిన్న సంస్కృతులు, స్వభావాలను అర్థం చేసుకోవడంతోపాటుగా దాని అద్భుత సౌందర్యాన్ని అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో త్వరలో జరగబోయే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ గురించి ప్రస్తావించారు.
‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో అనుంధానమయ్యే, వారి ఆశలు, ఆకాంక్షలు, చివరికి ఫిర్యాదులను తెలుసుకొనే అద్భుత అవకాశం తనకు లభించిందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇ-మెయిల్స్, టెలిఫోన్, ‘మై గవ్’ యాప్, నరేంద్ర మోదీ యాప్‌లపై నిరంతరంగా పంపిస్తున్న ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేయడానికి తాను ప్రయత్నించానని అన్నారు. ఫలితంగా ప్రభుత్వం కూడా వారి సమస్యలను, భావాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభించిందన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న వినోబా భావే మాటలను గుర్తుకు తెచ్చుకొంటూ ఉంటానని ప్రధాని చెప్పారు. గ్రామాల అభివృద్ధికోసం నానాజీ దేశ్‌ముఖ్ పరితపించే వారని, ఆయన కన్న కలలు ఇప్పుడు సాకారమవుతున్నాయన్నారు. గాంధీజీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్ లాంటివారు అధికారానికి దూరంగా ఉండి సేవ చేయడంద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ‘సర్వ జన హితాయ-సర్వజన సుఖాయ’ అన్నదే వారి నినాదమని, తాను కూడా వారి బాటలోనే నడుస్తూ ‘స్వచ్ఛతా హీ సేవా’ పిలుపునిస్తే క్రీడాకారులు, సినీనటులు, విద్యావేత్తలు, విద్యాసంస్థలు, రైతులు.. ఒక్కరేమిటి, సమాజంలోని అన్ని వర్గాలనుంచి అద్భుతమైన స్పందన లభించిందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తన అలోచనలకు మద్దతు ఇచ్చిందన్నారు. ప్రజలంతా ఇప్పుడు పరిశుభ్రత వైపు అడుగులేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద గత అయిదారు సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ వస్తున్న బిలాల్ దార్ అనే యువకుడి కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దార్ ఇప్పుడు శ్రీనగర్ మున్సిపాలిటీ చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
అమరవీరులైన భర్తలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరిన లెఫ్టినెంట్ స్వాతి మహదిక్, లెఫ్టినెంట్ నిధి దూబేలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 11 నెలల పాటు కఠోర శిక్షణ పొంది దేశానికి సేవ చేయడానికి సిద్ధమైన ఆ ధీర వనితలను ప్రశంసించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఖాదీ వస్త్రాలను ధరించడానికి ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వచ్చే ‘మన్‌కీ బాత్’లో ఆయన గురించి ప్రస్తావిస్తానని తెలిపారు.