జాతీయ వార్తలు

హెచ్‌సియు వ్యవహారంలో జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్టప్రతిని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కలిసి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం రాష్టప్రతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ హెచ్‌సీయులో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని, హెచ్‌సీయు విసి అప్పారావును వెంటనే తొలగించాలని రాష్టప్రతిని కోరారు. వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వీసీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించినపుడు పోలీసులు మహిళలు అనికూడా చూడకుండా లాఠీచార్జి చేసిన విషయాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకువచ్చానన్నారు. ఈ నెల 24న ఇంచార్జి వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన జరగాల్సిన అకడమిక్ కౌన్సిల్ భేటీని వైస్ ఛాన్సలర్ కావాలనే వాయిదా వేయించిన అంశాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. హెచ్‌సియులో విద్యార్థులపై కేసులు బనాయించిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లానని, అయితే ఇప్పటికీ ఆయన ఈ విషయమై స్పందించలేదన్నారు.