జాతీయ వార్తలు

నల్లధనంపై సిట్.. ఆర్టీఐ పరిధిలోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: నల్లధనంపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకే వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుందన్న విషయాన్ని మరువరాదని సమాచార హక్కు చట్టం కమిషనర్ బిమల్ జుల్కా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చలామణీలోవున్న నకిలీ నోట్లను అడ్డుకునేందుకు కేంద్రం రూపొందించిన విధానంతో 2014లోనే సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎంబి షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేయడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్బీఐ, ఐబి, ఇడి, సిబిఐ, ఎఫ్‌ఐయు, రా విభాగాల సమన్వయంతో నల్లధనం కేసుల నిగ్గు తేల్చాల్సిన బాధ్యతలను సిట్‌కు అప్పగించారు. ఒక కేసులో భాగంగా హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు జెనీవా బ్రాంచి మాజీ ఉద్యోగి హెర్వ్ ఫాల్సిని, సిట్ చైర్మన్‌కు రాసిన ఉత్తరంలోని ఏడు అంశాల సమాచారం తనకు ఇవ్వాలంటూ ఆర్టీఐద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖను సామాజిక ఉద్యమకర్త వెంకటేష్ నాయక్ పిటిషన్ వేశారు. అయితే, దర్యాప్తులోవున్న కొన్ని కేసులకు సంబంధించి కీలక సమాచారం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్న విషయం ఆర్టీఐలోనే స్పష్టంగా ఉందని, ఫాల్సిని ఇచ్చిన సమాచారం అందివ్వలేమంటూ ఆర్థిక శాఖ, కేంద్ర పన్నుల విభాగం తిరస్కరించాయి. అలాగే కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారం కేవలం సిట్ సభ్య కార్యదర్శి వద్ద మాత్రమే ఉంటుందని కూడా స్పష్టం చేశాయి. దీంతో సమాచార కమిషన్‌ను ఆశ్రయించిన వెంకటేష్ నాయక్, 2005 ఆర్టీఐ చట్టంలోని 2(హెచ్) సెక్షన్ ప్రకారం నల్లధనంపై ఏర్పాటైన సిట్‌ను ప్రజా ప్రాథికార సంస్థగా గుర్తించి, వివరాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో వాదనలు వినిపించిన కేంద్ర రెవిన్యూ అధికారి ఒకరు, సిట్‌కు సంబంధించి ఆర్టీఐ ద్వారా వచ్చే దరఖాస్తులు వెంటనే పంపేస్తామని, వాటిపై సిట్ స్పందిస్తుందా లేదా అన్నది తమ పరిధిలో ఉండదంటూ సమాధానమిచ్చారు. ‘ప్రభుత్వ నిధులతో నల్లధనంపై పనిచేస్తున్న సిట్ ఎలాంటి సమాచారాన్ని అయినా కోరిన మీదట ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. అది దాని విధి కూడా. కాకపోతే, ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాలా? వద్దా? అనేది 2005 ఆర్టీఐ చట్టంలోని పొందుపర్చిన నిబంధనల మేరకే ఉంటుంది’ అని రెవిన్యూ అధికారి కమిషన్‌కు సమాధానమిచ్చారు.