జాతీయ వార్తలు

ఎడ్లబండ్ల పోటీలకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 11: మహారాష్టల్రో ఎడ్లబండ్ల పోటీలపై విధించిన స్టేను ఎత్తివేయడానికి బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఎడ్ల బండ్ల పోటీలపై నిషేధం ఎత్తివేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. జంతువులతో క్రీడలు నిర్వహించడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజుల చెల్లూర్, జస్టిస్ ఎన్‌ఎం జందర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులో జల్లికట్టును నిషేధిస్తూ 2014లో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (మహారాష్ట్ర సవరణ) చట్టం-2017ను హైకోర్టు కొట్టివేసింది. పోటీల్లో పాల్గొనే జంతువులకు శారీరకంగా లేదా క్రూరంగా హింసించబోమని సవరణ చట్టంలో స్పష్టం చేయలేదని బెంచ్ పేర్కొంది. అలాగే ఎలాంటి భరోసా ఇవ్వలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో నిషేధాన్ని ఎత్తివేయడానికి న్యాయమూర్తులు అంగీకరించలేదు. ఎద్దులు మిగతా జంతువులు అంటే గుర్రాలు, శునకాలు, పావురాలు వంటివి కాదని అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యానిమల్స్ చట్టాన్ని సవాల్ చేస్తూ పూణెకు చెందిన అజయ్ మారథే హైకోర్టులో పిటిషన్ వేశారు. జంతు క్రీడలు అనుమతించాలని పిటిషన్‌లో ఆయన అభ్యర్థించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 16న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కోర్టు నిలిపివేసింది. ఈ పోటీల్లో జంతుహింస ఉండదంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేసిందని ప్రభుత్వ న్యాయవాది అస్పీ చినొయ్ కోర్టు దృష్టికి తెచ్చారు. పోటీల్లో పాల్గొన్న ఎద్దులను హింసించడం లేదా క్రూరంగా ప్రవర్తించడం జరగదని దీనికి అనుగుణంగానే కొత్త చట్టం రూపొందించినట్టు ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో బెంచ్ ఏకీభవించలేదు. జల్లికట్టు నిషేధం సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం లేదని అభిప్రాయపడ్డ కోర్టు స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ‘వ్యవసాయ సంబంధిత పనుల కోసమే ఎద్దులను వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు వాటితో పోటీలు నిర్వహిస్తామంటే ఎలా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. స్టే ఎత్తివేయడానికి నిరాకరించి బెంచ్ పిటిషనర్ సుప్రీం కోర్టుకు వెళ్ లేందుకు వెసులుబాటు కల్పించింది. ‘సుప్రీం కోర్టు అనుమతి ఇస్తే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించుకోవచ్చు’ అని పేర్కొంది.