జాతీయ వార్తలు

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఐఏఎఫ్ కమాండోలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 11: కాశ్మీర్‌లోని బండిపొర జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు గరుడ్ కమాండోలు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారని, బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయని సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఐఏఎఫ్ గరుడ్ కమాండోలు మృతిచెందారని, కమాండోలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారని ఆయన పేర్కొన్నారు. హాజిన్ ప్రాంతంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో శిక్షణలో భాగంగా ఐఏఎఫ్ గరుడ్ కమాండోలు పాల్గొన్నారని, వీరిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారని పేర్కొన్నారు. గాయపడిన వారిని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పుల్లో ఐఏఎఫ్ కమాండోలు సార్జంట్ మిలింద్ కిశోర్, కార్పొరల్ నీలేష్ కుమార్ మరణించారు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తానీ మిలిటెంట్ ఆలీ అలియాస్ అబూ మాజ్, స్థానిక మిలిటెంట్ నస్రుల్లా మీర్ హతమైనట్లు డిజిపి ఎస్.పి.వైద్ వెల్లడించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు చాలా దాడుల్లో కీలకపాత్ర పోషించారని, అనేకమంది సైనికులు, పౌరుల మృతులకు కారకులని ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడం బలగాలు సాధించిన పెద్ద విజయమని తెలిపారు. ఘటనా స్థలంలో రెండు ఎకె రైఫిల్స్, ఒక పిస్తోలు, గ్రనేడ్, 12 ఎకె మ్యాగజైన్స్, 75 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్‌కౌంటర్‌లో అమరులైన ఇద్దరు ఐఏఎఫ్ గరుడ్ కమాండోలకు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. సైనిక, పోలీసు, ఐఏఎఫ్ బలగాలకు చెందిన సీనియర్ అధికారులు అధికారులు సైతం నివాళులర్పించారు.